ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సముద్ర గర్భంలో యుద్ధ నైపుణ్యాలు... ఆతిథ్యమివ్వనున్న అందాల విశాఖ

milan: సముద్రం.. కొన్ని కోట్ల జలచరాలకు గర్భం... అద్భుత అందాలకు నిలయం... అపార ఔషధాల నిధి... పోషకాల బాండాగారం... అలాంటి సముద్రంలో కళ్లుచెదిరే నౌకా విన్యాసాలు...ఆకట్టుకునే పోరాట దృశ్యాలు...మిత్ర దేశాల మధ్య సాంకేతిక యుద్ధ నైపుణ్యాలు పరస్పరం మార్చుకోవడం మిలాన్ ప్రత్యేకత... కొన్ని రోజుల్లో ఈ అద్భుత కార్యక్రమానికి ఆతిథ్యమివ్వబోతోంది విశాఖ నగరం.

Milan event
విశాఖలో మిలన్​ కార్యక్రమం

By

Published : Feb 19, 2022, 12:35 PM IST

milan: విశాఖ మరో భారీ నౌకా ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి మార్చి 4 వరకు విశాఖ వేదికగా మిలాన్ ఉత్సవం నిర్వహించనున్నారు. మూడేళ్ల క్రితమే ఈ మినీ I.F.R. జరగాల్సి ఉన్నా... కొవిడ్ దృష్ట్యా వాయిదాపడుతూ వస్తోంది. 1995లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలాన్ కార్యక్రమంలో ఈ ఏడాది 45కి పైగా దేశాల యుద్ధ నౌకలు పాల్గొననున్నాయి. వివిధ దేశాల నౌకలకు ఆతిథ్యమిచ్చేందుకు పరేడ్, ఇతర విన్యాసాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 50కి పైగా యుద్ద నౌకలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.

మిలాన్ ఉత్సవం నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్‌రోడ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తోంది. ఈనెల 26న ఉత్సవం ఆరంభ వేడుక నిర్వహించనున్నారు. 27న అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుంది.

25 నుంచి 28 వరకు హార్బర్‌ దశ, మార్చి 1 నుంచి 4 వరకు సముద్రపు దశగా వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 4న మిలాన్ 2022 ముగింపు ఉత్సవం నిర్వహించనున్నారు.

విశాఖలో మిలాన్​ కార్యక్రమం

ఇదీ చదవండి:

Dangerous Fish in seawater: వీటి వేట... ప్రమాదాలతో సయ్యాట

ABOUT THE AUTHOR

...view details