రసాభాసగా మారిన.. మాకవరపాలెం మండల పరిషత్ సమావేశం - విశాఖ తాజా వార్తలు
Members conflict: విశాఖ జిల్లా మాకవరపాలెం మండల పరిషత్ సమావేశం అధికార పార్టీ, తెదేపా సభ్యులు వాగ్వాదానికి దిగారు. డంపింగ్ యార్డ్ విషయంలో ఎంపీపీని ప్రశ్నించిన స్థానిక తెదేపా మహిళా సర్పంచ్ శిరీష.. అధికారులు సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు.
మాకవరపాలెం మండల పరిషత్ సమావేశం
Members conflict: విశాఖ జిల్లా మాకవరపాలెం మండల పరిషత్ సమావేశం రసాభాస అయ్యింది. అధికార పార్టీ, తెదేపా సభ్యులు బాహాబాహీకి దిగడంతో సమావేశం గందర గోళంగా మారింది. ఎంపీపీ డంపింగ్ యార్డ్ విషయమై మాట్లాడుతుండగా స్థానిక తెదేపా మహిళా సర్పంచ్ అల్లం శిరీష ప్రశ్నించడంతో వైసీపీ తెదేపా వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అధికారులు సమాధానం చెప్పాలంటూ సర్పంచ్ పట్టుబట్టారు. దళిత సర్పంచ్‌ను కావడం వల్లే తనను చిన్న చూపు చూస్తున్నారని శీరిష అవేదన వ్యక్తం చేశారు.