ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vizag Steel Plant: ఉక్కు పోరాటానికి మేధా పాట్కర్ మద్దతు

గాజువాకలో జరుగుతున్న విశాఖ ఉక్కు పోరాట ఉద్యమానికి పర్యావరణ ఉద్యమకారిణి మేదా పాట్కర్ మద్దతు తెలిపారు.

Vizag Stell Plant
ఉక్కు పోరాటానికి మేథా పాట్కర్ మద్దతు

By

Published : Oct 30, 2021, 12:14 PM IST

Updated : Oct 31, 2021, 3:10 AM IST

విశాఖపట్నం గాజువాకలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ ఉక్కు పోరాట ఉద్యమానికి పర్యావరణ ఉద్యమకారిణి మేదా పాట్కర్ మద్దతు తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ, బహిరంగసభలో పాల్గొన్న ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇఫ్టూ జాతీయ అధ్యక్షులు డా. అపర్ణ సంఘీభావం తెలిపారు. కూర్మన్నపాలెం దగ్గర కార్మికులు చేపట్టిన దీక్ష నేటికి 261 రోజులకు చేరుకుంది.

ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రశ్నించారు. ప్రజలు నిర్మించుకున్న వాటిని అమ్మే హక్కు కానీ, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మార్చే హక్కు కానీ ఏ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. కేవలం ప్రజా ఉద్యమం ద్వారానే కేంద్రం దిగి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ చేస్తున్న పనులు పూర్తిగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్ధలకు మనుగడ లేకుండా చేస్తోందన్నారు.

Last Updated : Oct 31, 2021, 3:10 AM IST

ABOUT THE AUTHOR

...view details