కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణలను నిలిపివేయాలని, లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో కార్మిక సదస్సు నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయు సంయుక్త ఆధ్వర్యంలో వహించింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేరిట ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపు నిలిపివేయాలని కోరారు. ప్రజా ప్రదర్శనలకు, ధర్నాలకు పోలీసులు అనుమతులు ఇవ్వాలని, ప్రదర్శనలో పాల్గొన్న వారిపై జిల్లాలో ముందస్తు అరెస్టులు నిలిపివేయాలని కోరారు.
విశాఖ పౌర గ్రంథాలయంలో కార్మిక సదస్సు నిర్వహణ - meeting on labours act
విశాఖ పౌర గ్రంథాలయంలో ఏఐటీయూసీ, సిఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కార్మిక సదస్సు నిర్వహించింది.
కార్మిక సదస్సు