ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VMRDA: వీఎంర్‌డీఏ బృహత్తర ప్రణాళిక-2041..వసూళ్లు మొదలుపెట్టిన మధ్యవర్తులు - mediators-cheating-with-people-about-vmrda-master-planట

విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ -వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక-2041 ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. విశాఖ-విజయనగరం జిల్లాల్లోని 35 మండలాల పరిధిలో ఎక్కడ రోడ్లు వస్తాయి..?ఏ ప్రాంతాన్ని ఏవిధంగా వినియోగించాలి..? వంటి అంశాలతో ప్రణాళికను రూపొందించారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించగా వివిధ ప్రాంతాల నుంచి 16 వేలకు పైగా వచ్చాయి. అయితే... ఈ ప్రతిపాదనలను మార్చుతామని కొందరు మధ్యవర్తులు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటికి సంబంధించి అధికారులకు ఫిర్యాదులు సైతం అందుతున్నాయి.

వీఎంర్‌డీఏ బృహత్తర ప్రణాళిక-2041 ముసాయిదా.
వీఎంర్‌డీఏ బృహత్తర ప్రణాళిక-2041 ముసాయిదా.

By

Published : Sep 12, 2021, 6:23 PM IST

విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా రహదారుల గురించే వచ్చాయి. కొందరు భూ వినియోగాలను మార్చాలని, మరికొందరు గ్రీన్‌బెల్ట్‌ తొలగించాలని కోరారు. వీఎంఆర్‌డీఏ తయారుచేసిన బృహత్తర ప్రణాళిక ముసాయిదాలో.. ఆనందపురం మండలంలోని గంభీరం, వేములవలస ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్‌లో పెట్టడం, ప్రైవేటు స్థలాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం కోసం ప్రతిపాదించారు. భీమిలి, భోగాపురం మండలాల్లో ఎక్కడికక్కడ నూతన మాస్టర్‌ప్లాన్‌ రోడ్లను చూపించారు. నగరంలోని రక్షిత అడవిలో రహదారి, జలవనరుల మీదుగా కొన్ని రోడ్లు వెళ్లేలా ప్లాన్‌ చేశారు. ప్రైవేటు భూములను ప్రజారవాణా ప్రాంతాలుగా పేర్కొన్నారు. చాలాచోట్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతరగా, నివాస ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్‌లోకి ప్రతిపాదించారు. వీటిపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి.

దళారుల అక్రమ వసూళ్లు..

వీఎంఆర్​డీఏ బృహత్తర ప్రణాళిక ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని కొందరు మధ్యవర్తులు మభ్యపెడుతున్నారు. స్థలాలు, ఇళ్లు, పొలాలు పోతాయని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇళ్లు, పొలాల మీదుగా వెళ్తున్న ప్రతిపాదిత రోడ్లను అధికారులకు డబ్బులిచ్చి తొలగిస్తామని అందుకు కొంత ఖర్చు అవుతుందని వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రణాళిక ముసాయిదాపై అంతగా అవగాహన లేని ప్రజలకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు దక్కించుకునేలా ప్రణాళిక చేస్తున్నారు. ఈ క్రమంలో భీమిలి, భోగాపురం సరిహద్దు ప్రాంతాల్లోని రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అప్రమత్తంగా ఉండండి...

దళారుల మోసాన్ని వీఎంఆర్​డీఏ అధికారులు గమనించి అప్రమత్తమయ్యారు. బృహత్తర ప్రణాళికకు సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహాలున్నా ప్రతిరోజు సాయంత్రం 4-5 గంటల మధ్యలో సిరిపురం కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో సాధ్యమైన వాటిని పరిష్కరించే యోచనలో అధికారులు ఉన్నారు. సాధ్యం కాని వాటిని పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిని దళారులు అనుకూలంగా మలుచుకుని ప్రజలను మోసగిస్తున్నారు. రోడ్లను తీయిస్తామని, భూ వినియోగాన్ని మార్చుతామని నమ్మించే ప్రయత్నం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవీచదవండి.

THUNGABHADRA: తుంగభద్రకు జలకళ.. ఆనందంలో ప్రజలు

దిగ్గజాలే కానీ ప్రపంచకప్​ అందుకోలేకపోయారు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details