విశాఖ జిల్లా చోడవరం గ్రామీణ ప్రాంతాలలో మేడే వేడుకలను కార్మికలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగరవేసి ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక శ్రామికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని కార్మిక నాయకులు వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో కార్మికులు, కర్షకులు భారీగా పాల్గొన్నారు.
భీమిలి నియోజకవర్గ పరిధిలో వామపక్ష కార్మిక సంఘాలు వాడవాడలా జెండాలు ఎగురవేశారు. ఆటో కార్మిక నాయకులు జెండా ఎగరవేశారు. తగరపువలసలో ఎర్రజెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను ప్రభత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని నాయకులు కోరారు.
కార్మికుల హక్కుల సాధనలో అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు సి.హెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద మే డే జెండాను ఎగరవేసి కార్మిక వందనం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ అలుపులేని పోరాటం చేస్తుందన్నారు.