మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'మత్తు వదలరా' చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. కథానాయకుడు శ్రీ సింహ, సంగీత దర్శకుడు కాల బైరవా, నటి అతుల్య చంద్ర విశాఖలో చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశాఖ సన్ స్కూల్ విద్యార్థులు... బాహుబలి చిత్రంలోని పాత్రలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
విశాఖలో సందడి చేసిన 'మత్తు వదలరా' చిత్ర బృందం - mathu vadalara team visited vizag
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారులు నటుడిగా, సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'మత్తు వదలరా'. ప్రస్తుతం ఈ బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖలో సందడి చేసింది.
![విశాఖలో సందడి చేసిన 'మత్తు వదలరా' చిత్ర బృందం mathu vadalara team visited vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5603780-28-5603780-1578233758144.jpg)
విశాఖలో సందడి చేసిన 'మత్తు వదలరా' చిత్ర బృందం