విశాఖ ఆర్కే బీచ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల మహాకవాతు జరిగింది. ఈ మహాకవాతులో అఖిలపక్ష స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, నిర్వాసిత పోరాట సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్యరామ్, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి సంజయ్, ఏఐటీయూసీ నేత ఆదినారాయణ, సీపీఎం కార్పొరేటర్ గంగరావు, నిర్వాసిత సంఘం అధ్యక్షుడు అప్పారావు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ పాల్గొన్నారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా మహా కవాతు - visakha Latest News
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖలో మహా కవాతు నిర్వహించారు. ఆర్కే బీచ్ నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వరకు మహా కవాతు జరిగింది. ముగింపు సభలో ఐఎన్‌టీయూసీ నేత సంజయ్‌సింగ్ పాల్గొన్నారు.
మహా కవాతు