ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Maoists Letter : 'బాక్సైట్‌ తవ్వకాలు ఆపండి లేదా మన్యం విడిచి వెళ్లండి..లేదంటే' - Mavos Letter on Bauxite‌:

Mavos Letter on Bauxite‌: విశాఖ మన్యంలో బాక్సైట్​ తవ్వకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మావోయిస్టులు హెచ్చరించారు. అక్రమ తవ్వకాలను విద్యార్థి, ప్రజాసంఘాలు అడ్డుకోవాలని సీపీఐ మావోయిస్టు విశాఖ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది. 'అక్రమ తవ్వకాలు ఆపండి లేదా మన్యం వదిలిపొండి' అని హెచ్చరించారు. లేదంటే గతంలో ఎమ్మెల్యేలకు పట్టిన గతే పడుతుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Mavos Letter on Bauxite‌
బాక్సైట్‌ తవ్వకాలను ఆపండి లేదా మన్యం విడిచి పొండి -మావోయిస్టు నేత లేఖ

By

Published : Mar 8, 2022, 9:50 AM IST

బాక్సైట్‌ తవ్వకాలను ఆపండి లేదా మన్యం విడిచి పొండి -మావోయిస్టు నేత లేఖ

Mavos Letter on Bauxite‌: లేటరైట్‌ ముసుగులో విశాఖ మన్యంలో బాక్సైట్‌ను ప్రజాప్రతినిధుల అండదండలతో బడాబాబులు దోచుకుంటున్నారని, దీన్ని విద్యార్థి, ప్రజాసంఘాలు అడ్డుకోవాలని సీపీఐ మావోయిస్టు విశాఖ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది. విశాఖ జిల్లా జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో లక్షలాది రూపాయలు తీసుకుని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు.

బాక్సైట్‌ తవ్వకాలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో 11 వేల హెక్టార్ల భూమిలో ఉన్న ఖనిజ నిక్షేపాలపై నాయకుల కళ్లు పడ్డాయని పేర్కొన్నారు. భద్రాచలానికి చెందిన అజయ్‌కుమార్ అనే వ్యాపారికి కోట్లాది రూపాయల విలువైన బాక్సైట్‌ను లేటరైట్‌ ముసుగులో దోచి పెడుతున్నారని ఆరోపించారు. 'అక్రమ తవ్వకాలు ఆపండి లేదా మన్యం వదిలిపొండి' అని హెచ్చరించారు. లేదంటే గతంలో ఎమ్మెల్యేలకు పట్టిన గతే పడుతుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details