విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అన్ని మతాలను సమానంగా ఆదరించాలని అశోక్ గజపతిరాజు కోరారు. వాహనమిత్ర పథకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులు మళ్లించడం మంచిది కాదని హితవు పలికారు.
'రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అన్ని మతాలను ఆదరించాలి' - ashok gajapathi raju visited simhachalam temple
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అన్ని మతాలను సమానంగా ఆదరించాలని అశోక్ గజపతిరాజు అన్నారు. సింహాచలం అప్పన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అశోక్ గజపతి రాజు