ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

STEEL PLANT: ప్రైవేటీకరణకు నిరసనగా 10 వేల మందితో మానవహారం.. తెదేపా మద్దతు - vizag news

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకణ నిర్ణయానికి వ్యతిరేకంగా 10 వేల మంది కార్మికులతో తలపెట్టిన మానవహారానికి తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

STEEL PLANT
STEEL PLANT

By

Published : Aug 28, 2021, 5:16 PM IST

విశాఖ గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అఖిలపక్ష నాయకులు 29న చేపట్టబోయే మానవహరం కార్యక్రమానికి.. జిల్లా తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తన మద్దతు ప్రకటించారు. విశాఖ ప్రజల కడుపు కొడుతున్న కేంద్రానికి బుద్ధి వచ్చేలా మానవహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పల్లా పిలుపునిచ్చారు. అగనంపూడి నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పొడవునా.. 10 వేల మంది కార్మికులతో మహా మానవహారాన్ని అఖిలపక్ష నాయకులు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details