విశాఖ జిల్లా కంచరపాలెం పోలీసుస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా ఇప్పిలివలసకు చెందిన గణపతి అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. గణపతికి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గణపతి బుచ్చిరాజుపాలెంలోని ఓ కర్రీ పాయింట్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కంచరపాలెం పీఎస్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Kancharapalem latest news
విశాఖ జిల్లా కంచరపాలెం పీఎస్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గొంతు కోసుకుని గణపతి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గణపతిని కేజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా ఇప్పిలివలసకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Man commits suicide in front of Kancharapalem PS