Murder: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. పెదజాలారి పేటలో అప్పన్న అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇవాళ ఉదయం కొందరు వ్యక్తులు అప్పన్న ఇంటికి వెళ్లి తలపై కొట్టి కత్తితో ఒంటిపై దాడి చేసి హతమార్చి పరారైనట్లు స్థానికులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Murder: వ్యక్తి దారుణ హత్య, తలపై కొట్టి కత్తితో దాడి చేసి - విశాఖ వార్తలు
Murder: విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తితో దాడి చేసి అతనిని హతమార్చారు. అసలేం జరిగిందంటే..?
వ్యక్తి దారుణ హత్య