విశాఖలో మల్లేశం చిత్రబృందం సందడి ప్రజల్లో 'మేకిన్ ఇండియా' స్ఫూర్తి నింపేందుకు మల్లేశం సినిమా ఉపయోగపడుతుందని ఆ సినిమా దర్శకుడు రాజ్ అన్నారు. విశాఖ మద్దిలపాలెంలోని సీఎమ్ఆర్ షాపింగ్ మాల్‌లో మల్లేశం చిత్ర విజయ యాత్ర జరిగింది. చిత్రబృందంతోపాటు చేనేత కార్మికులను సీఎమ్ఆర్ అధినేత వెంకటరమణ సత్కరించారు. అనంతరం చిత్ర బృందం చేనేత కార్మికులతో ముచ్చటించింది. జాతీయస్థాయిలోనూ మల్లేశం చిత్రానికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందని నటుడు ప్రియదర్శి అన్నారు. తల్లి కష్టాలు తీర్చేందుకు ఓ సామాన్యుడు పడిన కష్టాన్ని ఈ సినిమా ఆవిష్కరించిందని నటి అనన్య చెప్పారు.