రామకృష్ణ బీచ్లో ఘనంగా మహాకుంభాభిషేకం - Maha kumbabhisekam news in Ramakrishna beach
మహాశివరాత్రి సందర్భంగా విశాఖ రామకృష్ణ బీచ్లో మహా కుంభాభిషేకం ఘనంగా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో నూటొక్క నదుల నుంచి తెచ్చిన గంగ, సముద్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో భక్తులు స్వహస్తాలతో పాదరస లింగేశ్వరునికి, కోటిలింగాలకు అభిషేకం నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా విశాఖ రామకృష్ణ బీచ్లో మహా కుంభాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు అభిషేక వాటికకు చేరుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో నూటొక్క నదుల నుంచి తెచ్చిన గంగ, సముద్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో భక్తులు పాదరస లింగేశ్వరునికి, కోటిలింగాలకు అభిషేకం నిర్వహించారు. సుబ్బిరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహా కుంభాభిషేకానికి వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సినీ నటీమణులు వాణిశ్రీ, మీనా హాజరయ్యారు.