ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Maha Dharna: 'సీఎం జగన్‌ అధ్యక్షతన అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి' - Mahadharna at Patagajuwaka Junction

Maha Dharna At Visakhapatnam : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. తమ పోరాటానికి ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షత వహించి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని నేతలు డిమాండ్‌ చేశారు.

విశాఖ స్టిల్ ఉద్యమం
విశాఖ స్టిల్ ఉద్యమం

By

Published : Dec 8, 2021, 12:47 PM IST

Visakhapatnam Steel Conservation Committee: మూడు సాగుచట్టాలను రద్దు చేసినట్లే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్నీ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు.. 300 రోజులు పూర్తైన సందర్భంగా కార్మికులు పాతగాజువాక జంక్షన్‌లో మహాధర్నా చేపట్టారు. తమ పోరాటానికి ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షత వహించి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

పాతగాజువాక జంక్షన్‌లో మహాధర్నా

ABOUT THE AUTHOR

...view details