సంచలనం సృష్టించిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విశాఖ మానసిక వైద్యశాలలో వారికి చికిత్స పూర్తైంది. వారిరువురినీ మదనపల్లె సబ్జైలు అధికారులకు అప్పగించనున్నారు.
ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించాలని తిరుపతిలోని రుయా ఆస్పత్రి వైద్యులు గతంలో చెప్పారు. వారి సూచనల మేరకు పోలీసులు నిందితులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం విశాఖకు పంపించారు.