తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్ప పీడనం 24 గంటల్లో బలపడి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..కోస్తాంధ్రకు వర్ష సూచన! - ఏపీలో వర్షం వార్తలు
తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, యానాంకు వర్ష సూచన ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర కోస్తా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర లేదా దక్షిణ ఒడిశా ప్రాంతంలో వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, యానాంకు వర్ష సూచన ఉంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు.
ఇజీ చదవండి: గోప్యంగా మహారాజా కళాశాల ప్రైవేటీకరణ ప్రక్రియ