ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న అల్పపీడనం... రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు - ఏపీలో వర్షాలు తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో... ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందన్నారు.

కొనసాగుతున్న అల్పపీడనం
కొనసాగుతున్న అల్పపీడనం

By

Published : Sep 24, 2020, 6:59 PM IST

ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో... ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురవచ్చని అధికారులు తెలియజేశారు. రాయలసీమలో ఇవాళ ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు.. రేపు, ఎల్లుండి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details