తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఏపీ, ఒడిశా వైపుగా అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శుక్రవారానికి పశ్చిమ వాయవ్యంగా కదులుతూ.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుందని అంచనా వేశారు. ఫలితంగా.. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
low pressure at bay of bengl.. rains at kostahandhra
శుక్రవారానికి పశ్చిమ వాయవ్యంగా కదులుతూ.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుందని వివరించారు. ఫలితంగా శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వివరించారు.
ఇదీ చదవండి: