Jayaprakash Narayana on debts: దేశ, రాష్ట్ర బడ్జెట్‌లు దారి తప్పుతున్నాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పారు. కుటుంబంలో పాటించినట్లే ప్రభుత్వాలూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని హితవు పలికారు. అప్పు చేసి పప్పుకూడు మనం తినమని అన్నారు. అప్పు చేసిన డబ్బును రోడ్లు, నీటిపారుదలకు ఖర్చు చేయాలని సూచించారు. రాజకీయ నేతలు గుజరాత్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. విభజన చట్టం హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు.
JP on debts: ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి: జయప్రకాశ్ నారాయణ - ఏపీ అప్పులపై జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలు
Jayaprakash Narayana on debts: రోజువారీ అవసరాలకు ప్రభుత్వాలు అప్పులు చేస్తే అవే మన పిల్లలకు శాపంగా మారతాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాన్ని మార్చేందుకు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తోందని ఆయన కితాబిచ్చారు. ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు.
జయప్రకాశ్ నారాయణ
"దేశ, రాష్ట్ర బడ్జెట్‌లు దారి తప్పుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయి. కుటుంబంలో పాటించినట్లే ప్రభుత్వాలూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అప్పు చేసి పప్పుకూడు మనం తినం. అప్పు చేసిన డబ్బును రోడ్లు, నీటిపారుదలకు ఖర్చు చేయాలి. రాజకీయ నేతలు గుజరాత్‌ను చూసి నేర్చుకోవాలి. విభజన చట్టం హామీలను కేంద్రం నెరవేర్చాలి." -జయప్రకాశ్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు
ఇవీ చదవండి: