కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా అధికారులతో కలెక్టర్ వినయ్ చంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండేలా తీసుకోవలసిన చర్యలను కలెక్టర్ వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపేలా గ్రామ, పట్టణ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు అనకాపల్లి ఆర్డీఓ సీతారామారావు వివరించారు. కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
విశాఖ యంత్రాంగం కఠిన చర్యలు - lock down in vishaka patnam
కరోనాను నిర్మూలించే దిశగా విశాఖ అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా చర్యలపై కలెక్టర్ వినయ్ చంద్.. సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. తాజా పరిస్థితి తెలుసుకున్నారు.
కరోనా వ్యాప్తిపై అప్రమత్తమైన విశాఖ