ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్ వాసన!

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిసర గ్రామమైన వేంకటాద్రి నగర్​లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ పక్కనే ఉన్న ఈ గ్రామ వాసులే మృతుల్లో ఎక్కువ మంది. ప్రమాద సమయంలో వాయువు తీవ్రత కూడా గ్రామంపై ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఇళ్లలో స్టైరీన్ గ్యాస్ వాసన వస్తుండడం వల్ల.. ఇళ్లలో ఉండలేకపోతున్నామని గ్రామస్థులు అంటున్నారు. తమ బాధను చెప్పుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్ వాసన!
ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్ వాసన!

By

Published : May 28, 2020, 10:59 AM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ గోడను ఆనుకుని ఉన్న గ్రామాలు వేంకట్రాది నగర్, వెంకటాపురం. ప్రమాదం జరిగిన ట్యాంక్​లు.. గ్రామస్థుల ఇళ్ల నుంచి 50 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ కారణంగానే రసాయన వాయువు తీవత్ర ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇళ్ల గోడల నుంచి ఇంకా రసాయన వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

స్టైరీన్ వాసన వస్తుండడం వల్ల చిన్న పిల్లలను ఇళ్లకు తీసుకురాలేని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. తమ ఆరోగ్యపరిస్థితిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఇళ్లలో విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదుచేసిన పోలీసులు పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. వాయువు తీవ్రత ఇంకా ఉందని చెబితే పుకార్లు పుట్టిస్తున్నారని తిరిగి తమపై కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు కూడా తమను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి :భూముల విక్రయంపై మరో రెండు వ్యాజ్యాలు.. నేడు విచారణ

ABOUT THE AUTHOR

...view details