విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న రికార్డుల నిర్వహణ కోసం ఆ సంస్థ అకౌంట్స్ విభాగం సిబ్బంది 16 మంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వారు వెళ్లే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతో సమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి..,జస్టిస్ లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఎల్జీ పాలిమర్స్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి - ఎల్జీ పాలిమర్స్ ఘటన
ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న రికార్డుల నిర్వహణ కోసం ఆ సంస్థ అకౌంట్స్ విభాగం సిబ్బంది 16 మంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వారు వెళ్లే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతో సమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎల్జీ పాలిమర్స్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి