అంతర్జాతీయ లెవల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సదస్సులో వాల్తేరు డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. 'మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఇంట్లో వేచి ఉన్నారు' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ల నుంచి రాకపోకలు సాగించేవారు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. భద్రతను పెంచి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
'రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద అప్రమత్తంగా ఉండండి'
రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద అప్రమత్తంగా ఉండాలని వాల్తేరు డీఆర్ఎం చేతన్ శ్రీవాస్తవ సూచించారు. అంతర్జాతీయ లెవల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం విశాఖలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైల్వే సివిల్ డిఫెన్స్ సిబ్బంది... వాహనచోదకులు, పాదచారులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
కరపత్రాలు పంచుతున్న రైల్వే సివిల్ డిఫెన్స్ సిబ్బంది