భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో రేపు... జనసేన తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ప్రత్యక్షంగా పాల్గొనబోమని చెప్పాయి. ఇసుక సమస్యపై నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సీపీఐ, సీపీఎంలను ఆహ్వానించినందుకు... ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. జనసేన నిరసనకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమానికి భాజపా సహకారం తీసుకోవడానికి... జనసేన పార్టీకి అభ్యంతరం లేదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని... ఈ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో వామపక్ష నేతలు పేర్కొన్నారు. అందువల్ల జనసేన ర్యాలీకి హాజరుకాలేకపోతున్నామని స్పష్టం చేశారు. కాగా తాను తలపెట్టిన ర్యాలీకి రావాల్సిందిగా... పవన్‌కల్యాణ్ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు నేరుగా ఫోన్ చేశారు.