ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం ముట్టడి.. వర్షంలోనూ కార్మికుల ఆందోళన - ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం ముట్టడించిన కార్మిక నేతలు

విశాఖలో ఉక్కు కార్మికులు ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం కూడలి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.

కార్మిక నేతలు
కార్మిక నేతలు

By

Published : Aug 17, 2021, 10:43 AM IST

ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం ముట్టడించిన కార్మిక నేతలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. నేటి ఉదయం ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనాన్ని కార్మిక నేతలు ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు చేతబట్టి కార్మిక నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం ముట్టడించిన కార్మిక నేతలు

స్టీల్ ప్లాంట్​కు వెళ్లే కార్మికులను అడ్డుకుని నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం కూడలి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కార్మికుల ఆందోళనతో దాదాపు రెండు కిలో మీటర్ల మేర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details