విశాఖకు చంద్రబాబు వస్తుంటే వైకాపా నేతలకు ఎందుకంత ఉలికిపాటని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వైకాపా భూ భాగోతాలు బయటపడతాయన్నదే వారి భయమని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలను కలిసేందుకు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటని నిలదీశారు. గడిచిన ఐదేళ్లలో తాము ఇలాగే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర జరిగేదా అని రవికుమార్ ప్రశ్నించారు. విశాఖలో దళితుల భూములను వైకాపా నేతలు బలవంతంగా లాక్కుంటున్నారని అన్నారు.
'చంద్రబాబు విశాఖ వస్తుంటే.. వైకాపా నేతలకు భయమెందుకు?' - వైకాపా ప్రభుత్వంపై కూన రవికుమార్ విమర్శులు
విశాఖకు చంద్రబాబు వస్తుంటే వైకాపా నేతలకు ఎందుకంత ఉలికిపాటని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో తాము ఇలాగే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర జరిగేదా అని ప్రశ్నించారు.
కూన రవికుమార్