ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కృష్ణానదీ బోర్డు విశాఖకు తరలించడం ఖాయం' - కృష్ణానదీ బోర్డు సమావేశానకిి ఏపీ నుంచి హాజరైన జలవనరుల శాఖ ఈఎన్సీ

రాష్ట్రం నుంచి జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ తరపున నాగార్జునసాగర్ సీఈ నర్సింహ.. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్​ జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో.. మార్చి నెలాఖరు వరకు ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై ప్రధానంగా చర్చించారు. బోర్డు ప్రధాన కార్యాలయం విశాఖకు తరలించడంలో మరో ఆలోచన లేదని మీడియాకు నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

krishna river board meeting in hyderabad
హైదరాబాద్​లో కృష్ణానదీ బోర్డు సమావేశం

By

Published : Feb 5, 2021, 5:58 PM IST

హైదరాబాద్​లో కృష్ణానదీ బోర్డు సమావేశం

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం విశాఖకు తరలివెళ్తుందని.. అందులో మరో ఆలోచనే లేదని ఏపీ జలవనరులశాఖ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సమావేశం.. హైదరాబాద్​లోని జలసౌధలో ఈరోజు జరిగింది. రాష్ట్రం తరపున ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నాగార్జునసాగర్ సీఈ నర్సింహ పాల్గొన్నారు. మార్చి నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై సమావేశంలో చర్చించారు. సాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలు, మరుసటి ఏడాదికి మిగులు జలాల బదలాయింపు, వరద సమయాల్లో నీటి వినియోగం లెక్కించరాదన్న అంశాలు చర్చకు వచ్చాయి.

108 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ, 80 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ.. కృష్ణా బోర్డుకు ఇప్పటికే వినతులు సమర్పించాయి. శ్రీశైలంలో 810, సాగర్​లో 520 అడుగుల దిగువకు నీరు తీసుకోరాదని.. 95 టీఎంసీలలోపు స్వీకరించేందుకు మరోసారి వినతి సమర్పించాలని తెలంగాణ అధికారులు ఏపీకి తెలిపారు. సవరించిన లెక్కలతో రాష్ట్రం నుంచి మరోమారు వినతి వచ్చిన అనంతరం.. రెండు జలాశయాల్లోని మట్టాల ఆధారంగా నీటివిడుదల ఉత్తర్వులను బోర్డు జారీ చేయనుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details