సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. 6 హత్యలు, 5 ఎదురు కాల్పులతో పాటు 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఘటనల్లో కొర్రాకుమారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, వివక్ష, ఎన్ కౌంటర్లలో సహచరులను కోల్పోవడం వంటి కారణాలతో లొంగిపోయినట్లు కుమారి అలియాస్ శ్వేత తెలిపారు.
విశాఖలో మావోయిస్టు సభ్యురాలు కొర్రా కుమారి లొంగుబాటు - CPI Maoist Pedabayalu Area Committee
12:29 October 16
మావోయిస్టు సభ్యురాలు కొర్రా కుమారి అలియాస్ శ్వేత లొంగుబాటు
కొర్రకుమారి అలియాస్ శ్వేత.. దాదాపు 12 ఏళ్లు ఈమె మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఈమె.. 6 హత్యలు, 5 ఎదురు కాల్పులతో పాటు 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో వివక్ష, తదితర కారణాల వల్ల లొంగిపోయారు. ఈమెకు ప్రభుత్వం నుంచి రావల్సిన లబ్దిని అందేలా చూస్తాం. -బి.కృష్ణారావు, విశాఖ జిల్లా ఎస్పీ
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు.. "సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఇండస్ట్రీ 4.0" మంజూరు