విశాఖలో రేపు జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే స్టార్ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒడిశాకు చెందిన ఓ యువకుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన ఒంటిపై విరాట్ డ్రెస్ కోడ్, పేరు, తన ముఖాన్ని టాటూలుగా వేయించుకున్నాడు. ఇది గమనించిన కోహ్లీ ప్రాక్టీసు అనంతరం అతన్ని కలిసి ఆలింగనం చేసుకున్నాడు.
అభిమానంతో టాటూ వేసుకున్నాడు...కోహ్లీని ఆకర్షించాడు - భారత్- దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్
రేపు విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున అభిమానులు మైదానం వద్దకు చేరుకున్నారు. తమకు ఇష్టమైన ఆటగాళ్లను కలిసేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అలా కోహ్లీని ఆకర్షించేలా చేశాడు ఈ ఒడిశా యువకుడు.
అభిమానంతో టాటూ వేశాడు... కోహ్లీని ఆకర్షించాడు
Last Updated : Oct 1, 2019, 6:30 PM IST