కోడి మాంసం ఉత్పత్తులకు కరోనా వైరస్‌తో ముడిపెట్టి... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోందని ఉత్తరాంధ్ర బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. విశాఖలో పౌల్ట్రీ నిర్వాహకులు మాట్లాడారు. కోడి మాంసం, గుడ్ల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు. ప్రజలంతా నిర్భయంగా కోడి మాంసం, గుడ్లు తినవచ్చని స్పష్టం చేశారు.
'కరోనాకు... కోడి మాంసానికి సంబంధమే లేదు' - latest news of visakha poultry farms
మిర్చి, కోడి గుడ్లు, మాంసం ఉత్పత్తులపై కరోనా దెబ్బ పడింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో వీటిని కొనుగోలు చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇది అసత్య ప్రచారమని ఉత్తరాంధ్ర బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

విశాఖలో పౌల్ట్రీ ఫార్స్ నిర్వాహకులు సమావేశం
'కరోనాకు... కోడి మాంసానికి సంబంధమే లేదు'
TAGGED:
latest news of karnona virus