ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇంత త్వరగా మమ్మల్ని వీడి వెళతాడనుకోలేదు' - ఎస్పీబీ మృతిపై కళాతపస్వి ఆవేదన

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంపై పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. బాలు మరణవార్తపై కళాతపస్వి కె.విశ్వనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

kalathpaswi-k-vishwanath-on-sp-balasubramanyam-sudden-demise
బాలు మరణవార్తపై కళాతపస్వి కె. విశ్వనాథ్ తీవ్ర విచారం

By

Published : Sep 25, 2020, 5:14 PM IST

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తపై కళాతపస్వి కె.విశ్వనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు.

"భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలు నా సోదరుడే కాదు.. నా ఆరోప్రాణం. అలాంటిది ఇంత తొందరగా మమ్మల్ని వీడి వెళతాడనుకోలేదు. ఇలాంటి సమయంలో మాట్లాడటానికి మాటలు కూడా రావడం లేదు. భగవంతుడు బాలు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా. బాలు కుటుంబ సభ్యులంతా ఈ విషయాన్ని ఓర్చుకోవాలని కోరుతున్నా."

ABOUT THE AUTHOR

...view details