Agitation on School Merging: జాతీయ విద్యా విధానంలో భాగంగా.. పాఠశాలల విలీనంపై నిర్వహిస్తున్న సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ పాఠశాలను వేరే గ్రామ పాఠశాలలో విలీనం చేయొద్దంటూ.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని కడకెల్ల గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
పాఠశాల విలీనం.. వద్దంటూ వినూత్న నిరసన
Agitation on School Merging: ఒక గ్రామ పాఠశాలను.. మరో గ్రామానికి చెందిన పాఠశాలలో విలీనం చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామంలో చోటు చేసుకుంది.
పాఠశాల విలీనం.. వద్దంటూ గ్రామస్థుల వినూత్న నిరసన..
కడకెల్ల పాఠశాలను.. అదే మండలంలోని కంబరవలస గ్రామ ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీనికి కడకెల్ల గ్రామస్తులు అంగీకరించలేదు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆందోళనకు దిగారు. తమ గ్రామంలోనే పాఠశాల కొనసాగించాలని గ్రామస్థులు నినాదాలు చేశారు. పాఠశాల తరలించ వద్దంటూ వెనకకు నడుస్తూ వినూత్నంగా తమ నిరసన తెలిపారు.
ఇదీ చదవండి :చింతామణి నాటకం నిషేధంపై.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు