ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కేఏ పాల్ నిరసన దీక్ష - tenth exams in ap latest news

పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో దీక్ష చేపట్టారు. కరోనా విజృంభిస్తుంటే పది, ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదు అభిప్రాయపడ్డారు.

ka paul protest against the tenth, inter exams during corona time
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్

By

Published : Apr 29, 2021, 2:11 PM IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్

కరోనా విజృంభిస్తున్న సమయంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు విశాఖలోని కేఏ పాల్​ కన్వెన్షన్ భవనంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని కేఏ. పాల్ హెచ్చరించారు.

'పరీక్షలపై నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. హైకోర్టులో రేపే వాదనలు జరుగుతాయని ఆశిస్తున్నా. 35 లక్షలమంది విద్యార్థి లోకానికి మేలు జరిగేవరకు నా దీక్ష కొనసాగుతోంది . పరీక్షలు 2 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నా.' - ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్

ఇదీ చదవండి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details