ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేఈఈ మెయిన్స్​లో తెలుగు విద్యార్థుల సత్తా..నరసింహకు 5వ ర్యాంకు - జెఈఈ మెయిన్స్​లో తెలుగు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్-2020 పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఓపెన్ క్యాటగిరీలో విశాఖకు చెందిన వైఎస్ఎస్ నరసింహనాయుడు 5వ ర్యాంకు సాధించగా..శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డీ ఆదిత్య 393వ ర్యాంకు సాధించాడు.

jee mains results
jee mains results

By

Published : Sep 12, 2020, 3:23 PM IST

జేఈఈ మెయిన్స్ - 2020 పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఓపెన్ క్యాటగిరీలో విశాఖకు చెందిన వైఎస్ఎస్ నరసింహ నాయుడు 5వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా తాను చదువుకున్న అసెంట్ కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో ఓపెన్ క్యాటగిరిలో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని నరసింహనాయుడు ఆనందం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పూర్తి సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. ప్రతి సబ్జెక్ట్​లోనూ తనకున్న సందేహాలను అధ్యాపకులతో చర్చించి నివృత్తి చేసుకునేవాడని సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.

జేఈఈ మెయిన్స్ లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన వడ్డీ ఆదిత్యకు జాతీయ స్థాయిలో 393వ ర్యాంకు వచ్చింది. వడ్డీ రామ నర్సింహులు, సత్యవతిల కుమారుడైన ఆదిత్య విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ప్రాథమిక విద్య నుండి ఆదిత్య మంచి ర్యాంకు సాధిస్తూ గుర్తింపు పొందాడు. ఆదిత్య జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకు సాధించినందుకు పలువురు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రాణాలకు తెగించి.. గర్భిణికి చేయూత

ABOUT THE AUTHOR

...view details