ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలింగ్​లో అవకతవకలు జరిగాయి.. రీపోలింగ్ చేపట్టండి'​ - జనసేన ఆందోళన

విశాఖ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని 42వ వార్డులో జరిగిన పోలింగ్​లో అవకతవకలు జరిగాయంటూ జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీలు వేసే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని.. వెంటనే రీపోలింగ్​ నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

janasena tdp agitation
విశాఖ మున్సిపల్​ కార్పొరేషన్​ 42వ వార్డు

By

Published : Mar 11, 2021, 4:31 AM IST

విశాఖలో.. బ్యాలెట్ బాక్సులకు సీలు వేసే ప్రకియలో అవకతవకలు జరిగాయని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. వీఎంసీ 42వ వార్డులో రీపోలింగ్​కు వాళ్లు డిమాండ్​ చేశారు. ఏజెంట్ల నుంచి ప్రోసీడింగ్స్ సంతకాలు తీసుకోకుండానే బ్యాలెట్ పెట్టెలను బస్సులలో పంపించడంపై బూత్ ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. అధికారులను తీరుపై మండిపడ్డ ఏజెంట్లు.. అభ్యర్ధులతో కలిసి ఏసీపీ వాహనం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే సమయంలో కూడా ఆర్వో కనిపించకుండాపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అధికారపార్టీ కనుసన్నల్లోనే ఎన్నికల నిర్వహణ జరిగిందంటూ.. మండిపడ్డారు. వైకాపా అధికార దుర్వినియోగానికి తెగబడిందని.. రీపోలింగ్ నిర్వహించాలని జనసేన, తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details