ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2019, 6:45 PM IST

ETV Bharat / city

'రాజధానిని పులివెందులకు... కోర్టు కర్నూలుకు మార్చుకోండి'

రాజధానిని పులివెందులకు, కోర్టు కర్నూలుకు మారిస్తే వైకాపా నేతలకు వెళ్లిరావడం సులువుగా ఉంటుందని జనసేన అధినేత పవన్ ఎద్దేవా చేశారు. ప్రతిభ పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి, వైఎస్ పేరు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతికి సేవచేసిన వారికిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సొంత డబ్బులతో ప్రజలకేమైనా చేసి, పేర్లు పెట్టుకోండి కానీ... ప్రజాధనంతో చేపట్టే పథకాలకు వైఎస్ పేర్లేంటని నిలదీశారు.

'రాజధానిని పులివెందులకు... కోర్టు కర్నూలుకు మార్చుకోండి'

విశాఖలో జనసేన సమావేశం
రాజధానిని పులివెందులకు మార్చి... కర్నూలులో కోర్టు పెడితే వైకాపా నేతలకు పులివెందుల నుంచి వెళ్లి రావడం సులువుగా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వీటితో ఖర్చూ తగ్గుతుందని ఎద్దేవా చేశారు. విశాఖ జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ప్రతిభ పురస్కారానికి అబ్దుల్ కలాం పేరు మార్చడం సమంజసం కాదన్న ఆయన... దేశానికి మిసైల్ పరిజ్ఞానం ఇచ్చిన మహనీయుడి పేరిట ఉన్న పురస్కారానికి వైఎస్ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చాలా పథకాలకు పెట్టారన్న పవన్... ప్రతిభ పురస్కారాలకు వైఎస్ పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత డబ్బుతో ప్రజలకు ఏమైనా చేసి, వాటికి వైఎస్ కుటుంబం పేరు పెట్టుకోవాలని, అంతేకాని ప్రజాధనం ఉపయోగించే పథకాలకు ఆ పేర్లు ఎలా పెడతారని పవన్ ప్రశ్నించారు. జాతికి సేవ చేసినవారిని గౌరవించడం తెలియదా అని నిలదీశారు. దేశసేవ చేసిన వారికిచ్చే మర్యాద ఇదేనా అని నిలదీశారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వారికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందన్నారు. పేరు మార్చడంపై ప్రజావ్యతిరేకత చూసి... ఆ జీవో సంగతి సీఎం తనకు తెలియదని అంటున్నారని ఆరోపించారు. ఆ జీవో ఇచ్చిన వారిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details