స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా జీవీఎంసీ 31 వార్డులో జనసేన వీర మహిళలపై నిన్న దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయకపోవటంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాణి పేట స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పోలింగ్ బూత్ 16 వద్ద వీర మహిళలపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులు స్పందిచకపోతే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Janasena: దాడికి పాల్పడిన వైకాపా కార్యకర్తలను అరెస్టు చేయాలి: జనసేన - జనసేన ఆందోళన న్యూస్
స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా జీవీఎంసీ 31 వార్డులో జనసేన వీర మహిళలపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై నిన్న ఫిర్యాదు చేసినా..పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు.
దాడికి పాల్పడిన వైకాపా కార్యకర్తలను అరెస్టు చేయాలి