నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ విశాఖలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నష్టపరిహారం ముప్పై వేలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇవాళ సీఎం పీఠం దక్కిన తరువాత రైతుల బాధలు జగన్కు గుర్తుకు రావటం లేదా..? అని నిలదీశారు. రైతు భరోసా డబ్బులు వేసి వాటినే నష్టపరిహారంగా చూపించడం సరైన పద్ధతి కాదని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇస్తారా.. ఇవ్వరా..?... ఇస్తే ఎంత ఇస్తారు... ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం అందకపోతే అసెంబ్లీ ముట్టడి తప్పదని హెచ్చరించారు.
నోరు పారేసుకోవడం కాదు.. చర్చించండి: బోనబోయిన