రాష్ట్రంలో ఖనిజ సంపద దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని జనసేన పార్టీ ఆరోపించింది. తూర్పు గోదావరి జిల్లా వంతాడలో లేటరైట్ ఖనిజం తవ్వకం పేరుతో విలువైన బాక్సైట్ ఖనిజాన్ని లక్షల టన్నులు తరలించేస్తున్నారని.. ఈ విషయాన్ని 2018 లోనే తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల ముందుకు తెచ్చారని రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వంతాడలో ఆండ్రూ కంపెనీ తవ్వకాలు సాగించి డంప్ చేసే ప్రాంతానికి పవన్ కల్యాణ్ వెళ్లి అక్కడ జరుగుతున్న దోపిడీని బయటకు తెచ్చారని అన్నారు. అప్పట్లో లేటరైట్ ముసుగులో బాక్సైట్ ఎలా దోచేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఖనిజ దోపిడీ సాగుతోందని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు దాటవేత ధోరణిలో మాట్లాడుతోంది..? అని ప్రశ్నించారు.
భమిడికలొద్దిలో మైనింగ్ అక్రమాలు..
అప్పుడు వంతాడలో అక్రమానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నారో ఇప్పుడు భమిడికలొద్దిలోనూ అదే విధంగా అక్రమాలకు తెర తీశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వంతాడలో ఆండ్రూ కంపెనీ 34 లక్షల మెట్రిక్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని వేదాంత కంపెనీకి తరలించినట్లు ఇప్పటి గనుల శాఖ అధికారులు చెబుతున్నారని అన్నారు. ఆ తవ్వకాలకు కొద్దిపాటి దూరంలో ఉన్న భమిడికలొద్ది వద్ద జరుగుతున్న తవ్వకాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
ఖనిజ తరలింపునకు రోడ్లు..