ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అక్రమ కేసులపై చర్చిస్తాం.. అపాయింట్​మెంట్ ఇవ్వండి'.. డీజీపీకి జనసేన లేఖ - డీజీపీకి జనసేన లేఖ

జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు ఎక్కువయ్యాయని జనసేన అధినేత పవన్ అన్నారు. వేధింపులకు డీజీపీని కలిసి చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు అపాయింట్​మెంట్ కోరుతూ ఆ పార్టీ నేత నాందెడ్ల మనోహర్ డీజీపికి లేఖ రాశారు.

డీజీపీకి జనసేన లేఖ
డీజీపీకి జనసేన లేఖ

By

Published : May 31, 2022, 10:02 PM IST

Janasena seeks DGP Appointment: జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించటం, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసి చర్చించాలని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఈ మేరకు సమయం కోరుతూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డీజీపీకి లేఖ రాశారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం డీజీపీని కలిసి సమస్యలపై చర్చించేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. అపాయింట్​మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలపాలని నాదెండ్ల విజ్ఞప్తి చేశారు.

డీజీపీకి జనసేన లేఖ

ABOUT THE AUTHOR

...view details