ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PAWAN KALYAN: వచ్చే నెలలో విశాఖకు పవన్​కల్యాణ్​..స్టీల్​ ప్లాంట్​ కార్మికులకు మద్దతు - Vizag steel plant protest

వచ్చే నెలలో పవన్ కల్యాణ్​​ విశాఖ (janasena chief pawan kalyan to visit visakhapatnam)లో పర్యటించి.. స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటానికి మద్దతు తెలుపుతారని జనసేన పరిపాలన వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్​ కలిసినప్పుడు విశాఖ ఉక్కు ప్రస్తావన తీసుకొచ్చారని గుర్తు చేశారు.

పవన్​ కల్యాణ్
పవన్​ కల్యాణ్

By

Published : Sep 21, 2021, 3:50 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో భాజపా నాయకులతో పవన్ కల్యాణ్​ మాట్లాడి ఒప్పిస్తారని జనసేన పరిపాలన వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇన్నిరోజులు ఓపిక పట్టిన పవన్​...ఇప్పుడు స్వరం వినిపించనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించి.. స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటానికి మద్దతు తెలుపుతారని వెల్లడించారు.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్​ కలిసినప్పుడు విశాఖ ఉక్కు ప్రస్తావన తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇంకొద్ది రోజులు వేచి చూస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కల్యాణ్​ ఏ విధంగా పోరాడతారో అందరూ చూస్తారని చెప్పారు. అమరావతి రైతులు ఉద్యమం పట్ల కూడా జనసేన స్థిరంగా ఉందని అన్నారు.


ఇదీ చదవండి:

VIZAG STEEL: త్వరలోనే ఉక్కు పోరాటంలోకి పవన్ కల్యాణ్: నాదెండ్ల మనోహర్

ABOUT THE AUTHOR

...view details