ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫ్రై డే మ్యాన్​ విజయసాయిరెడ్డికి విమర్శించే హక్కు ఉందా? - విజయసాయిరెడ్డిపై పవన్ విమర్శలు వార్త

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఆ పార్టీ నాయకుల విమర్శలపై పవన్‌ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడినే గానీ... మరెవరికీ కాదని స్పష్టం చేశారు. ప్రతీవారం కోర్టుకెళ్లే విజయసాయిరెడ్డిని ఫ్రైడే మ్యాన్‌ అంటూ ఎద్దేవా చేసిన పవన్‌..తన గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపా నేతలకు లేదని..తేల్చిచెప్పారు. దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తానని.. ప్రకటించారు.

janasena cheaf pawan kalyan comments on vijayasaireddy

By

Published : Nov 4, 2019, 5:39 AM IST

తెలుగుదేశానికి జనసేన 'బీ' టీమ్‌ అంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మొదలు.. ఆపార్టీ నేతలు పదేపదే చేస్తున్న విమర్శలను పవన్‌ కల్యాణ్‌ తిప్పికొట్టారు. మంత్రులు బొత్స, కన్నబాబు వంటి నేతల చరిత్ర తనకు తెలుసనని.. వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని ఫ్రై డే మ్యాన్‌గా అభివర్ణించిన పవన్‌... ఎన్నికల్లో ఓడినంతమాత్రాన భయపడే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. దెబ్బతిన్నా మళ్లీ పైకి లేవడమే తన నైజమని తెగేసి చెప్పారు. దిల్లీ పెద్దలకు రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తానని.. ప్రకటించారు.

ఇవాళ, రేపు విశాఖలోనే ఉండనున్న పవన్‌ ఎన్నికల అనంతర పరిణామాలపై ఉత్తరాంధ్ర నాయకులతో సమీక్షిస్తారు.

ఫ్రై డే మ్యాన్​ విజయసాయిరెడ్డికి విమర్శించే హక్కు ఉందా?

ఇదీ చదవండి: 'రెండు వారాలే గడువు... స్పందించకపోతే అమరావతిలో నడుస్తా'

ABOUT THE AUTHOR

...view details