జీవీఎంసీ కోటపై జనసేన జెండా ఎగిరేలా ముందుకు వెళుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ పేర్కొన్నారు. విశాఖలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భాజపా, జనసేన నాయకులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని శివశంకర్ తెలిపారు. భాజపా - జనసేన కూటమిపై ప్రజలు దృష్టి పెట్టారని.. రెండు కుటుంబాల పాలనపై ప్రజలు విసుగు చెందారని ఎమ్మెల్సీ పీవీఎన్. మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం లేదని.. అన్నిచోట్ల కూటమి బాగుందన్నారు. అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం: జనసేన - భాజపా - GVMC Elections
విశాఖలో భాజపా, జనసేన నాయకులు సమావేశమయ్యారు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని నేతలు తెలిపారు. రెండు కుటుంబాల పాలనపై ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. మార్నింగ్, మ్యాట్నీ షోలు, మాల్స్ ఆపితే ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
విశాఖ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. 98 స్థానాల్లో భాజపా - జనసేన కలిసి పోటీ చేస్తున్నామని నేతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. ఓట్లకు డబ్బులిచ్చే సంస్కృతి భాజపా-జనసేనకు లేదని మాజీఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఓటుకునోటు ఇస్తే ఆనాడు పవన్కళ్యాణ్ గాజువాకలో గెలిచేవారని చెప్పారు. మార్నింగ్, మ్యాట్నీ షోలు, మాల్స్ ఆపితే ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యం బతికే అవకాశం ఉందని.. రాష్ట్రంలో రాక్షస పాలన అందరూ చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది: కళా వెంకట్రావు