ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనసేన 4వ జాబితా.. విశాఖ నుంచి 'జేడీ' - లక్ష్మీనారాయణ

సార్వత్రిక ఎన్నికలకు జనసేన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. ఇటీవలే పార్టీలో చేరిన విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణకు.. విశాఖ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది.

Janasena 4th list

By

Published : Mar 19, 2019, 5:30 PM IST

సార్వత్రిక ఎన్నికలకు జనసేన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. ఇటీవలే పార్టీలో చేరిన విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణకు.. విశాఖ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. విశాఖ - ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పసుపులేటి ఉషాకిరణ్‌... విశాఖ దక్షిణ అభ్యర్థిగా గంపల గిరిధర్... విశాఖ తూర్పు అభ్యర్థిగా కోన తాతారావు... భీమిలి అభ్యర్థిగా పంచకర్ల సందీప్... అమలాపురం అభ్యర్థిగా శెట్టిబత్తుల రాజబాబు... పెద్దాపురం అభ్యర్థిగా తుమ్మల రామస్వామి... పోలవరం అభ్యర్థిగా చిర్రి బాలరాజు... అనంతపురం అభ్యర్థిగా టి.సి.వరుణ్ ఎంపికయ్యారు.

నియోజకవర్గం అభ్యర్థి
విశాఖ లోక్​సభ వి.వి లక్ష్మీనారాయణ
విశాఖ ఉత్తరం (శాసనసభ) పసుపులేటి ఉషాకిరణ్
విశాఖ దక్షిణం (శాసనసభ) గంపల గిరిధర్
విశాఖ తూర్పు (శాసనసభ) కోన తాతారావు
భీమిలి (శాసనసభ) పంచకర్ల సందీప్
అమలాపురం (శాసనసభ) శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం (శాసనసభ) తుమ్మల రామస్వామి
పోలవరం (శాసనసభ) చిర్రి బాలరాజు
అనంతపురం (శాసనసభ) టీసీ వరుణ్

విశాఖ లోక్​సభ నియోజకవర్గం నుంచి సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీ నారాయణ పోటీ పడుతుండడం.. రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఈ స్థానంలో తెదేపా నుంచి శ్రీభరత్, వైకాపా నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ఈ రోజే ఖరారైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details