Pawan Kalyan reaction on cases: గత రెెండు రోజులుగా విశాఖలో వైకాపా, జనసేన నువ్వా నేనా అన్నట్లుగా బస్తీ మే సవాల్ అంటున్నాయి. రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో విశాఖ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. మంత్రుల కార్లపై దాడి చేశారంటూ జనసేన నేతలను అరెస్టు చేయడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ తరుపున కోర్టులో పిటిషన్ వేశారు. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు ఆరోపించిన అభియోగాలు చెల్లవని తెలిపారు. తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది.
నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు.. కోర్టును ఆశ్రయించిన జనసేన - Jana Sena party filed a case
Jana Sena party in Vishakhapatnam: జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు కొట్టివేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని కోర్టుకు జనసేన పార్టీ తరఫున పిటిషనర్ పేర్కొన్నారు. అక్రమంగా తమ నేతలపై కేసులు నమోదు చేశారని.. కోర్టుకు జనసేన తెలియజేసింది. పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది.
జనసేన నేతలపై కేసులు