ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Visakha: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలు..నలుగురిపై వేటు!

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జరిగిన అక్రమాలపై అధికారులు కొరడా ఝలిపించారు. నలుగురిని సస్పెండ్ చేస్తూ...ఉత్తర్వులు జారీ చేశారు.

Corruption in government liquor stores
ప్రభుత్వం మద్యం దుకాణాల్లో అక్రమాలు

By

Published : Jun 7, 2021, 12:36 PM IST

విశాఖలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. నకిలీ రసీదులతో నగదు మళ్లించిన వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. మర్రిపాలెం ఎక్సైజ్‌ సీఐ నాగశ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ కొండయ్య, కానిస్టేబుళ్లు జయరామ్, రామానాయుడులను సస్పెండ్​ చేశారు. ఎస్‌ఐ విమలాదేవిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. సస్పెండ్‌ చేస్తూ ఎక్సైజ్‌ కమిషనర్‌ రజత్‌భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

మర్రిపాలెం స్పెన్సర్స్, లక్ష్మీనగర్​తోపాటు..మర్రిపాలెంలోని మల్కాపురం, శాంతిపురం మద్యం దుకాణాల్లోని సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు నకిలీ రసీదులతో నగదు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details