ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ధీరజ్... రెండో ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టేశాడు - సివిల్స్ ఫలితాలు

ఇంటి నుంచే సివిల్స్ కలను సాకారం చేసుకున్నారు విశాఖకు చెందిన ధీరజ్. తండ్రి పోలీస్, సోదరి డాక్టర్... తనకంటూ ఓ ప్రత్యేక లక్ష్యం ఉండాలని అనుకున్న ధీరజ్... సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ దిశగా ప్రయత్నం మొదలు పెట్టారు. రెండో ప్రయత్నంలోనే అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు.

interview with civils ranker  dheeraj
interview with civils ranker dheeraj

By

Published : Aug 5, 2020, 7:20 PM IST

ధీరజ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

పేదలకు మంచి చేసేందుకు తన వంత కృషి చేస్తానని సివిల్స్​లో 320వ ర్యాంకు సాధించిన ధీరజ్ అన్నారు. విశాఖలో ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆయన... తన అనుభవాలను పంచుకున్నారు. గతంలో సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి నుంచి మెలకువలు తెలుసుకున్నానని చెప్పారు. వర్తమాన అంశాలపై క్రమం తప్పకుండా దృష్టి సారించానని అన్నారు. మెయిన్స్ వరకు వస్తే... అంశం వారిగా పట్టు సాధించాలని, ప్రత్యేకంగా నోట్స్​ను తయారుచేసుకున్నానని వెల్లడించారు. తెలుసుకున్న ప్రతి విషయాన్ని రివైజ్ చేసుకోవటంతో చాలా సులభం అయిందన్నారు. సివిల్స్ సాధనలో విశ్లేషణాత్మక నైపుణ్యం అత్యంత ముఖ్యమని వివరించారు. ముఖాముఖిలో మన నేపథ్యాన్ని బట్టి ప్రశ్నలను అడుగుతారని తెలిపారు. మూడు రాజధానులు మంచిదేనా వంటి ప్రశ్నలను కూడా తన ఇంటర్వ్యూలో అడిగారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details