ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేరొకరితో చనువుగా ఉంటుందని బ్లేడుతో గొంతు కోశాడు! - విశాఖ నేర వార్తలు

విశాఖ గాజువాకలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వారం రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు అఖిల్‌ పక్కా ప్రణాళికతోనే హత్య చేశాడని వెల్లడించారు. తప్పించుకోవడానికి తొలుత వేరొకరి ప్రమేయం ఉన్నట్లు చెప్పినా.. విచారణలో అఖిల్‌ నేరం అంగీకరించినట్లు సీపీ సిన్హా తెలిపారు.

వేరొకరితో చనువుగా ఉంటుందని బ్లేడుతో గొంతు కోశాడు!
వేరొకరితో చనువుగా ఉంటుందని బ్లేడుతో గొంతు కోశాడు!

By

Published : Nov 2, 2020, 6:37 AM IST

వేరొకరితో చనువుగా ఉంటుందని బ్లేడుతో గొంతు కోశాడు!

విశాఖ గాజువాక శ్రీనగర్‌లో బాలిక హత్య అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు పెంచుకున్న ద్వేషం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను ఇష్టపడుతున్న అమ్మాయి నిర్లక్ష్యం చేస్తూ వేరొకరితో చనువుగా ఉంటోందని కసి పెంచుకొని.. పథకం ప్రకారమే యువతిని అఖిల్‌ హత్యచేసినట్లు గాజువాక పోలీసులు నిర్ధరించారు. ఆదివారం బాలిక కుటుంబీకులను సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా పరామర్శించారు.

శనివారం రాత్రి బాలిక కుటుంబీకులు ఓ శుభకార్యంలో ఉండగా అఖిల్‌ ఆమెకు ఫోన్‌ చేసిన సాయిబాబా గుడి సమీపంలోని కొండపైకి రమ్మని పిలిచినట్లు పోలీసులు తెలిపారు. నాలుగైదు సార్లు ఫోన్‌ చేసి ఒత్తిడి చేయడంతో బాలిక కాదనలేకపోయినట్లు చెప్పారు. ఆమె అక్కడకి రాగానే.. రామ్‌తో ఎందుకు చనువుగా ఉంటున్నావని ప్రశ్నించి... ఒక్కసారిగా బాలిక మెడను పట్టుకుని బ్లేడుతో గొంతుకోసినట్లు నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు. ఆ సమయంలో అఖిల్‌ చేతివేళ్లకూ గాయాలయ్యాయని.. ఆ తర్వాత ఆమెను కొండ కిందకు లాక్కొచ్చి వదిలేశాడని పోలీసులు వివరించారు. ఘటనాస్థలిలో ఆధారాలు దొరక్కుండా కారంపొడి చల్లాడని తెలిపారు. ఘటనా స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్లు వాతావరణం సృష్టించి.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.

నిందితుడు అఖిల్‌ కేసును తప్పుదోవ పట్టించడానికే రామ్‌ అనే వ్యక్తి హత్య జరిగిన చోట ఉన్నట్లు కథ అల్లాడని పోలీసులు తెలిపారు. వాస్తవానికి బొబ్బిలికి చెందిన రామ్‌ ప్రైవేట్‌ ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా గాజువాక శ్రీనగర్‌లోని తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఆ సమయంలోనే బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. బాలికతో మాట్లాడవద్దని అఖిల్‌ రామ్‌తో ఇటీవలే గొడవపడ్డాడు . రామ్‌ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఈ కేసులో రామ్‌ పాత్ర లేదని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు అఖిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్న పోలీసులు... తర్వాతి విచారణ కోసం కేసును దిశ పోలీస్‌స్టేషన్‌కు బదలాయిస్తామన్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశామన్న పోలీసులు.. వారం రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details